గెలిచేది కూటమే.. చంద్రబాబే సీఎం, ప్రమాణ స్వీకారం ఎక్కడంటే : బుద్ధా వెంకన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఘట్టం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపై పడింది. జూన్ 4న ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఎన్ని సీట్లు వస్తాయి..? ఏపీకి తదుపరి సీఎం ఎవరు..? అంటూ కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. అయితే ఎవరికి వారు గెలుపు మాదంటే, మాదంటూ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వేదిక ఎక్కడో కూడా చెప్పేశారు. అమరావతిలోనే చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఓటింగ్ చూస్తేనే టీడీపీ విజయం ఖాయమనే విషయం అర్ధమైపోయిందన్నారు. ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఓటు వేసేందుకు తరలివచ్చారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
2014లో వచ్చిన 104 సీట్లను సైతం కూటమి అధిగమించబోతోందని .. జగన్‌పై ఉన్న కక్షతో ప్రజలు రాత్రి వరకు ఉండి ఓటు వేశారని ఆయన తెలిపారు. ఐదేళ్లలో అవకతవకలకు పాల్పడిన వారి ఫైళ్లను కూడా మాయం చేసేలా కుట్రలు చేస్తున్నారని.. ఓటమి ఖాయమని తెలిసి కూడా బొత్స సత్యనారాయణ గంభీరంగా మాట్లాడుతున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.
చంద్రబాబు 4వ సారి సీఎం అవుతున్నారు - టీడీపీ నేత బుద్దా వెంకన్న#ChandrababuNaidu #TDP #BuddhaVenkanna #Amaravathi #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/xmxyvrSlbn
— NTV Telugu (@NtvTeluguLive) May 15, 2024

Comments
Post a Comment